Wednesday, June 29, 2016

మాటలు లేని ఆలోచనలలో శ్వాసపై ధ్యాస ఉంచు

మాటలు లేని ఆలోచనలలో శ్వాసపై ధ్యాస ఉంచు
మౌనమే వహించి జీవమే దైవమని శ్వాసనే తలచు
శ్వాసపై ధ్యాసతో దుఃఖాన్ని దూరముగా వదిలించు
శ్వాసపై ధ్యాసతో ఆరోగ్యాన్ని మరింత మెరుగు పరుచు

ఏ అవయవము పనిచేయలేక పోతున్నా శ్వాసతో నిర్భయమే
ఏ ఆలోచన కష్టమౌతున్నా భావ స్వభావంతో శ్వాస ఆయుధమే
దేహమే క్షీణిస్తున్నా ఆత్మనే శ్వాసతో బంధిస్తూ నీలో పోరాటమే
మరణం వస్తుందని తెలిసినా ఈ క్షణమే జన్మించావని ఎదగడమే
వైద్యం తాత్కాలికమే శ్వాస నిరంతర జీవమే ధ్యాస నిత్య ఔషధమే
శ్వాసపై ధ్యాసతో మౌనమైన ఆలోచనతో ప్రతి శ్వాస నీకై జీవించడమే
శ్వాసపై ధ్యాసతో మరణాన్ని వదిలించు మౌనంతో జీవిస్తూ ఆయుస్సును పెంచు

No comments:

Post a Comment