వేదంలోనే లీనమైపోయా భావంతోనే నిలిచిపోయా
రూపంతోనే ఉండిపోయా వర్ణంలోనే ఒదిగిపోయా
దైవంలోనే ఆగిపోయా తత్వంతోనే మరచిపోయా
బంధంతోనే సాగిపోయా దేహంతోనే వెళ్ళిపోయా || వేదంలోనే ||
జీవత్వమైనా దైవత్వమైనా మన దేహంలోని దాగివుంది
అద్వైత్వమైనా పరతత్వమైనా మన జీవంలోని దాగివుంది
వేదత్వమైనా భావత్వమైనా మన మేధస్సులోనే దాగివుంది
గుణత్వమైన వర్ణత్వమైనా మన ఆలోచనలలోనే దాగివుంది || వేదంలోనే ||
పరతత్వ భావం రూపం
పరభావ తత్వం పరమాత్మ దేహం
పరరూప వేదం పరజీవ తత్వం
పరదేహ మోహం పరధాత భావం
జీవం నిలయం దేహం ఆలయం
కాలం శాంతం సమయం క్షేత్రం
విశ్వంలోనే వేద సత్యం జగంలోనే వేదాంత ధర్మం
మౌనంలోనే మోహ బంధం శూన్యంలోనే సర్వ శాంతం || వేదంలోనే ||

No comments:
Post a Comment