Friday, July 8, 2016

అమ్మ అంటే జీవమని మాతృ భావన

అమ్మ అంటే జీవమని మాతృ భావన
తల్లి అంటే దైవమని జగతి తత్వము
విశ్వమంతా జీవమై జగతి మాతృ తత్వమే ఐనది   || అమ్మ అంటే ||

శ్వాసతోనే శ్వాసను సృష్టించే జీవమే అమ్మ
శ్వాసలోన శ్వాసకు ఉచ్చ్వాస నిచ్చ్వాసే అమ్మ

తన ఆత్మ యందే మరో ఆత్మను జత చేర్చుకునే భావనయే అమ్మ
ద్వి ఆత్మల ద్వి జీవముల చతుర శ్వాసయే తల్లి ఉచ్చ్వాస నిచ్ఛ్వాస

రెండు ప్రాణాలతో ఒక మనస్సుతో జీవించే దైవమే అమ్మ
రెండు జీవములతో ఒకే స్వభావంతో జీవించే భావనయే అమ్మ    || అమ్మ అంటే ||

తన జీవము నుండే మరో తన ప్రతి రూపాన్ని ఇచ్చే హృదయమే అమ్మ
తన దేహములోనే మరో దేహాన్ని అన్ని అవయవాలతో సృష్టించేదే అమ్మ

అమ్మ అంటే దైవమని అమ్మమ్మ అంటే మాతృత్వమని కొలిచేదే మాతృదేవోభవ
తల్లి అంటే జీవమని మాత అంటే ఆత్మ పరమాత్మ అని తలిచేదే మహాత్మదేవోభవ

అమ్మతోనే జన్మిస్తూ అమ్మతోనే ఎదుగుతూ అమ్మనే మహా దైవమని గౌరవించాలి
అమ్మతోనే విజ్ఞానం అమ్మతోనే నడవడి నేర్చుకుంటూ అమ్మమ్మనే సత్కరించాలి  || అమ్మ అంటే || 

No comments:

Post a Comment