Monday, July 25, 2016

నా భావాలకు నిద్రించే అవకాశం లేదే

నా భావాలకు నిద్రించే అవకాశం లేదే
నా తత్వాలకు నిలిచే సమయం లేదే
నాలో జీవించే ఆత్మకు ఆగే కాలం లేదే   || నా భావాలకు ||

నాలోని భావాలు విశ్వములో జీవించే ప్రకృతి స్వభావాలే
నాలోని తత్వాలు జగతిలో దాగిన అద్భుత రూప సత్వాలే

ప్రతి సమయం విశ్వమే నాలో చేరేలా భావాలను సృష్టిస్తున్నది
ప్రతి క్షణం జగతే నాలో కలిగేలా తత్వాలను జీవింపజేస్తున్నది   || నా భావాలకు ||

నా శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు విశ్వ భావాలతో సాగేనే
నా మేధస్సులో ఆలోచన స్వభావాలు ఆత్మ తత్వమై సాగేనే

ఏ సమయం ఏ క్షణ భావన నా మేధస్సుకు చేరునో ఏకాగ్రతతో మెళకువనై ఉన్నాను
ఏ క్షణం ఏ సమయాలోచన తత్వమో ఆత్మకే తెలిసేలా నాలో నేనే ఎరుకనై ఉన్నాను  || నా భావాలకు || 

No comments:

Post a Comment