నా దారి సరైనదేనా సరికాకపోతే సరిచేయవా కాలమా
నాకు నచ్చినా నా వారికి సరిలేక తెలిసి తెలియనట్లే
అటు ఇటు ఎటో ఎవరికి తెలియకపోతే నాకెలా తెలిసేది
నా దారి నాకైనా సరిపోవాలనే సర్దుకుని పోతున్నాను
ఏనాటికైనా నే నడిచేదారే మహా ద్వారమవుతుందనే
కాలంతో ప్రయాణిస్తున్నా విజ్ఞాన వేదనతో భావనగానే
ఆలోచనగా ఆలోచిస్తే సత్యాన్ని తెలిపే దారి తెలుస్తుంది
No comments:
Post a Comment