ఏనాటి మహత్యమో నాలోనే దాగినది ఓ మహా భావన
విశ్వమున నాలో కలిగినా మరల ఎవరికి కలగదే అలా
రూపము చూడలేనంతగా భావము తలచలేనంతగా
ఎవరికి తెలియని అనంతరూపం తెలియని ఆ భావం
కలగానైనా ఊహగానైనా తెలుసుకోలేని గ్రహించలేనిది
తెలుపుటకు వీలుకానిది తెలుపాలనే భావన తోచనిది
నాలోనే మిగిలిపోయెను పరమాత్మ మహాత్య భావనలా
No comments:
Post a Comment