Tuesday, September 16, 2025

శరీర భావనయే దేహ తత్త్వం

శరీర భావనయే దేహ తత్త్వం 

ఆలోచనల స్వభావాలే శరీర భావాల చలనం - భావాల చలనమే దేహంలో కలిగే తత్త్వం 
జ్ఞానేంద్రియాల అన్వేషణయే మేధస్సులో ఆలోచనల ఉత్పన్నం - ఆలోచనల స్వభావాలే జ్ఞానేంద్రియాల అర్థాన్ని గ్రహించు విధానం 

అర్థాన్ని గ్రహించునది మేధస్సులో దాగిన జ్ఞాపకాల నిర్మాణ విధానం 
అర్థంలో అపార్థం (అనర్థం) లేదా విజ్ఞానం లేదా అజ్ఞానం లేదా పరమార్థం వివిధ రకాలుగా జ్ఞాపకాల నిర్మాణ విధానంలో దాగి ఉండవచ్చు 

వీలైనంతవరకు మానవ మేధస్సులో అర్థాలను విజ్ఞాన పరమార్థంగా జ్ఞాపకాల నిర్మాణంలో దాచుకోవాలి 

మనం తెలుసుకునేదే అర్థం మన అవగాహనయే విజ్ఞానం మనం గ్రహించునదే మన జ్ఞాపకం 

మేధస్సులో ఆలోచనలు అర్థాలుగా అనర్థాలుగా అజ్ఞానంగా విజ్ఞానంగా పరమార్థంగా కలుగుతూనే వివిధ రకాల అవగాహనలతో జ్ఞాపకాల నిర్మాణంలో చేరిపోతాయి  
జ్ఞాపకాల నిర్మాణంలో అర్థాలు చేరిపోయేటప్పుడు దాచుకునేటప్పుడు ఆలోచనల భావాల యధార్థ విజ్ఞాన అర్థాలే దాచుకోవాలి అప్పుడు విజ్ఞానం అభివృద్ధి చెంది భావాలు పరిశుద్ధమైన పరమార్ధంతో ఉంటాయి కార్యాలు పరమార్థ అనుభవాలతో సాగుతూ సత్ఫలితాలను ఇస్తాయి 

జననం ఒక భావన మరణం ఒక తత్వన జీవితం ఎన్నో కార్యాల సంగమం 

-- వివరణ ఇంకా ఉంది! 

No comments:

Post a Comment