Monday, April 25, 2016

మళ్ళీ మళ్ళీ రాని భావన మళ్ళీ మళ్ళీ రాని ఆలోచన

మళ్ళీ మళ్ళీ రాని భావన మళ్ళీ మళ్ళీ రాని ఆలోచన
మళ్ళీ కలగాలని మళ్ళీ తోచాలని మళ్ళీ చూడాలని
మనలో కలిగే భావం మనలో దాగిన ఆలోచన నేడు వచ్చేనే || మళ్ళీ మళ్ళీ ||

మనస్సు మెచ్చిన భావనే మళ్ళీ కలగాలని మన ఆలోచన
హృదయం తలచిన ఆలోచనే మళ్ళీ రావాలని మన భావన

వసంతాలతో వచ్చే ఋతువులు వందనాలు పలికే పక్షులు
వచ్చి పోయే కాల భావ ఆలోచనలు వాతావరణ ప్రభావాలే  || మళ్ళీ మళ్ళీ ||

కాలంతో సాగే జీవరాసులు ఎన్నో ప్రతి క్షణం ఎదిగే జీవులు ఎన్నో
జనన మరణ ప్రమాణాలు ఎన్నో ప్రతి సమయం కారణాలు ఎన్నో

ఎవరు ఎవరిని మళ్ళీ చూసేదెవరో మళ్ళీ మళ్ళీ కలిసేదెవరో
ఎవరు ఎవరిని మళ్ళీ తలచేదెవరో మళ్ళీ మళ్ళీ కలిపేదెవరో  || మళ్ళీ మళ్ళీ || 

No comments:

Post a Comment