Thursday, April 28, 2016

విశ్వ భావమై వచ్చాను ఈ జగతికి విశ్వ తత్వమై ఉన్నాను ఈ లోకానికి

విశ్వ భావమై వచ్చాను ఈ జగతికి విశ్వ తత్వమై ఉన్నాను ఈ లోకానికి
భావంతోనే ప్రయాణిస్తూ తత్వాన్నే దాచుకుంటూ జగతిలోనే జీవిస్తున్నాను
నీటియందు నేనే గగనమందు నేనే భూమిపైన నేనే గాలిలోన నేనే భావనగా
ఆకార రూపముల అణువు పరమాణువుల యందు నేనే దాగి ఉన్నాను
విశ్వాన్ని విడచి వెళ్ళలేను జగతిని మరచి ఉండలేనని ఇక్కడే కొలువుంటాను
శూన్యమందు ఆది భావమై ఉదయించానేమో అంతం లేని తత్వంతో సాగిపోతున్నాను
విశ్వ కాలం నన్నే పిలిచి జగతిని భావాలతో నడిపించేలా నన్నే అడిగి సాగింది
ప్రతి భావన ఓ కార్యమై కాలంతో సాగేలా జీవితాలు ఎన్నో సాగి పోవాలి
విశ్వ కాలంతో సాగే భావాలకై విశ్వ భావమై ఈ జగతి లోకానికి వచ్చానేమో
ఆత్మగా లేకున్నా కాలమై ఉంటానని ప్రతి అణువులో భావమై ఉదయిస్తున్నా
ఓ విశ్వ మానవా! విశ్వమున జీవిస్తూ నా విశ్వ భావనను గ్రహించు మిత్రమా! 

No comments:

Post a Comment