ఒక వైపే ఉన్నావా మహాత్మ
ఒక చోటనే ఉంటావా పరమాత్మ
ఒకరితోనే ఉండి పోతావా మహా ఆత్మ || ఒక వైపే ||
ఎక్కడ వెతికినా కనిపించని నీడవై ఉన్నావా నీలోనే నీవుగా
ఏమని అన్వేషించినా జాడ తెలియని దూరమై పోయావా నీవు
ఎంత కాలం ప్రయాణించినా దర్శనమే లేని ప్రతి రూపమే నీవు
నీలో నీవే జీవించే స్వభావం ఎదిగే ప్రకృతిలోనే ఉన్నదా
నీలోన నీవే దాగే జీవం ప్రతి జీవి శ్వాసలోనే ఉంటుందా
నీలో నీవై నిలిచే తత్త్వం ప్రతి జీవి రూపంలో ఉండేనా || ఒక వైపే ||
ఎక్కడ ఉన్నా కనిపించని నీ రూపం ఆత్మగా ఉదయిస్తున్నదా
ఎక్కడ నిలిచినా కనిపించే భావంతో మహాత్మవై జీవిస్తున్నావా
ఎక్కడ ఎవరు ఉన్నా వారి దేహంలోనే పరమాత్మవై దాగివున్నావా
ఒక వైపు చూసే లోకం మరోవైపు చూడలేని పరమార్థం నేనే
ఒకే చోట అన్వేషించే విశ్వం అందరిలాగే తెలియని మహత్యం
ఒకరినే ప్రశ్నించే ప్రపంచం మరొకరితో జీవించలేని నిత్య సత్యం || ఒక వైపే ||

No comments:
Post a Comment