Friday, August 5, 2016

ఎవరి రూపము అద్భుతము ఎవరి మేధస్సు ఆశ్చర్యము

ఎవరి రూపము అద్భుతము ఎవరి మేధస్సు ఆశ్చర్యము
ఎవరి భావన అంతర్భావము ఎవరి తత్వము అద్వైత్వము || ఎవరి ||

సూర్యోదయము కన్నా గొప్ప రూపము విశ్వ రూపమా
మహాత్మ జ్ఞానము కన్నా గొప్ప విజ్ఞానము బ్రంహ జ్ఞానమా
పరమాత్మ కన్నా గొప్ప భావన అంతరాత్మమేనా
మహా తత్వము కన్నా గొప్ప భావన మాతృత్వమా   || ఎవరి ||

తల్లి నీవే అద్వైత్వమా తండ్రి నీవే అంతర్భావమా
ఆత్మ నీవే అమోఘమా మహాత్మ నీవే అపురూపమా
జీవం నీవే దైవమా దేహం నీవే దైవత్వమా
సత్యం నీవే నిత్యమా ధర్మం నీవే అనంతమా    || ఎవరి || 

No comments:

Post a Comment