Monday, April 17, 2017

ఆలోచనకే ఆలోచనగా మిగిలావా

ఆలోచనకే ఆలోచనగా మిగిలావా
భావానికే భావనగా మిగిలున్నావా
స్వరానికే స్వరమై ఆగిపోయెదవా
వేదనకే ఆవేదనమై ఆగిపోయావా

మనలో దాగిన భావాలే ఆలోచనలుగా స్వరమై వేదమయ్యేను
మనలో నిండిన స్వప్నాలే ఊహలుగా భావాలనే కలిగించేను  || ఆలోచనకే ||

ఏ జీవి తత్వమో ఏ జీవి రూపమో
ఏ రూప భావమో ఏ తత్వ జీవమో

మనిషిగా ఎదిగే జీవం ఏ స్వభావమో
మనిషిగా ఒదిగే జీవం ఏ వేదాంతమో

మనలో మనమే మనమై జీవిస్తున్నాం
మనలో మనమే మనమై ఆలోచిస్తున్నాం   || ఆలోచనకే ||

ఏనాటి జీవ తత్వమో ఏనాటి జీవ రూపమో
ఎటువంటి రూపత్వమో ఎంతటి జీవత్వమో

మనిషిగా జీవించే స్వభావం మనలో విశ్వాసమే
మనిషిగా ధ్యానించే భావం మనలో ప్రశాంతమే

మనలో మనమే ఏకమై మనమే నివశిస్తున్నాం
మనలో మనమే ఐక్యమై మనమే జ్వలిస్తున్నాం   || ఆలోచనకే ||

No comments:

Post a Comment