Monday, October 17, 2016

నా అంతర్ముఖంలో దాగిన అంతర్యామివి నీవే

నా అంతర్ముఖంలో దాగిన అంతర్యామివి నీవే
నా అంతర్భావంలో నిండిన అనంత మూర్తివి నీవే
నా అంతర్భాగంలో ఒదిగిన అవధూత శక్తివి నీవే
నా అంతర్లోకంలో వెలిసిన అంతరాత్మవు నీవే    || నా అంతర్ముఖంలో ||

నీవు ఎక్కడ ఉన్నా నీవే నా పరమాత్మవు
నీవు ఎక్కడ ఉన్నా నీవే నా పరంజ్యోతివి
నీవు ఎక్కడ ఉన్నా నీవే నా పరంధామవు
నీవు ఎక్కడ ఉన్నా నీవే నా పరతత్వానివి

ఏమని తలిచినా నీవే నా దేహంలో ఉన్నావు
ఎంతని కొలిచినా నీవే నా మేధస్సులో ఉంటావు
ఎలా పిలిచినా నీవే నా భావనలో ఉండిపోతావు
ఎలా పలికినా నీవే నా మాటలో ఉంటున్నావు    || నా అంతర్ముఖంలో ||

ఏమని తెలిపెదను నీ రూప తత్వాలను
ఏమని తపించెదను నీ భావ గుణాలను
ఏమని వహించెదను నీ వేద సత్యాలను
ఏమని వినిపించెదను నీ ధర్మ గీతాలను

ఎక్కడ వెళ్ళినా నాకు నీవే వెలుగును చూపెదవు
ఎక్కడ ఉన్నా నాకు నీవే మార్గాన్ని చూపించెదవు
ఎక్కడ ఉంటున్నా నాకు నీవే భోదన చేసెదవు
ఎక్కడ ఉండినా నాకు నీవే తోడై చేయూతనిచ్చేవు  || నా అంతర్ముఖంలో || 

No comments:

Post a Comment