Tuesday, October 25, 2016

తప్పుకు శిక్షగా శిక్షలో శిక్షణ లేకపోతే మరెన్నో తప్పులు జరిగిపోవును

తప్పుకు శిక్షగా శిక్షలో శిక్షణ లేకపోతే మరెన్నో తప్పులు జరిగిపోవును
పొరపాటుకు సాధనలో సాధించే సాహసం లేకపోతే మరుపు కలుగును
వృధా చేయుటలో మరొకరికి ఉపయోగం లేకపోతే ఎంతో తరిగిపోవును
విశ్వమున నీవు జీవించుటలో క్షమాపణ తెలుపుటకు అవకాశం ఇవ్వకు
లోకమున నీవు మరణించుటచే ఇతరులకు లెక్క సరిపోయిందని కలిగించు
జగమున నీవు ఎదుగుటలో నేర్చినది ఎంతో కాలం ఉపయోగమని భావించు
సృష్టిలో నీవు ప్రయాణించుటలో సమయం అభివృద్ధికేనని చరిత్రను సేకరించు 

No comments:

Post a Comment