Thursday, October 13, 2016

ఒక జీవిగా చిరంజీవిగా జీవించవా జీవత్వమా

ఒక జీవిగా చిరంజీవిగా జీవించవా జీవత్వమా
ఒక ఆత్మగా పరమాత్మగా పలికించవా పరతత్వమా  || ఒక జీవిగా ||

ఈ జగతికి నీవే మహాత్మవై పరంధామగా అవతరించావు
ఈ విశ్వానికి నీవే మహర్షివై పరంజ్యోతిగా అధిరోహించావు
ఈ లోకానికి నీవే అవధూతవై అంతర్యామిగా అంతర్భవించావు

ప్రతి జీవిలో ఒకే జీవత్వమే చిరంజీవిగా జీవిస్తూ మరణించే భావత్వమే
ప్రతి అణువు ప్రతి జీవి ఆనందంగా జీవించాలనే విశ్వాన్ని వేడుకొనెను
ప్రతి అణువు ప్రతి జీవి సంతోషంగా మరణించాలనే కాలాన్ని కోరుకొనెను  || ఒక జీవిగా ||

ప్రతి జీవిలో ప్రతి అణువులో ఒకే జీవత్వమై ఒకే ప్రేమత్వమై దాగేను
ప్రతి జీవిలో ప్రతి అణువులో ఒకే భాషత్వమై ఒకే సత్యత్వమై ఉండేను
ప్రతి జీవిలో ప్రతి అణువులో ఒకే శ్వాసత్వమై ఒకే ధ్యాసత్వమై సాగేను

మనిషిగా జీవించే ప్రతి జీవిలో విజ్ఞానమే సంపూర్ణమైన ప్రజ్ఞానమయ్యేను
మనిషిగా ఎదిగే ప్రతి జీవిలో వివేకత్వమే పరిశుద్ధమైన పరిపూర్ణమయ్యేను
మనిషిగా ఒదిగే ప్రతి జీవిలో అనుభవమే పేమత్వమైన పరిశోధనమయ్యేను  || ఒక జీవిగా || 

No comments:

Post a Comment