Wednesday, October 5, 2016

అమ్మ అంటే ప్రాణమని అమ్మ అంటే ఊపిరని

అమ్మ అంటే ప్రాణమని అమ్మ అంటే ఊపిరని
అమ్మ అంటే జీవమని అమ్మ అంటే శ్వాస అని
అమ్మతోనే జన్మించి ఎదిగాము మహా రూపమై     || అమ్మ ||

అమ్మగా లాలించి దీవిస్తుంది
తల్లిగా ఓదార్చి పలికిస్తుంది
మాటలనే నేర్పిస్తూ నడిపిస్తుంది
విజ్ఞానాన్నే భోదిస్తూ మెప్పిస్తుంది

అమ్మయే మహాత్మగా దైవత్వం చూపుతుంది
తల్లియే పరమాత్మగా కరుణామృతం చాటుతుంది  || అమ్మ ||

అమ్మగా స్నేహాన్ని తెలుపుతుంది
తల్లిగా ధైర్యాన్ని ఇచ్చేస్తుంది
రక్షణగా మనతోనే ఉండిపోతుంది
మాతగా మన కోసమే జీవిస్తుంది

అమ్మయే మహర్షిగా వేదాలనే వివరిస్తుంది
తల్లియే దేవర్షిగా అనుభవాలనే కలిగిస్తుంది  || అమ్మ || 

No comments:

Post a Comment