Thursday, October 20, 2016

ఏ గురూ ఓ గురూ ఒక్కసారి భోదించవా

ఏ గురూ ఓ గురూ ఒక్కసారి భోదించవా
ఏ గురూ ఓ గురూ మరోసారి వివరించవా

నీవు నేర్పే ఏ జ్ఞానమైన మాకు ఉపయోగమేగా
నీవు తెలిపే ఏ అనుభవమైనా మాకు విజ్ఞానమేగా  || ఏ గురూ ||

జీవితంలో ఎన్నో నేర్చుకోవాలి మరెన్నో సాధించాలి
జీవనంతో ఎన్నో నిర్మించుకోవాలి ఎన్నో అనుభవించాలి

జీవించే విధానంలో మార్పులెన్నో గమనించాలి
జీవించే జీవన శైలినే ఎన్నో విధాలా మార్చుకోవాలి

ఎదురయ్యే సమస్యలను అనుభవంతో పరిష్కరించాలి
సమస్యలనే తగ్గించుకోవాలంటే క్రమ పద్ధతిలో జీవించాలి  || ఏ గురూ ||

నూతన విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఎదుగుదలకై మనమే తెలుసుకోవాలి
నూతన విధానాన్ని ఎప్పటికైనా సులువుగా ఉండేలా మనమే అందించాలి

కాలం నేర్పే ఎన్నో విధానాలను మనమే సాధనతో అధిగమించాలి
జీవితం నేర్పే ఎన్నేన్నో పాఠాలను మనమే సహనంతో చదువుకోవాలి

ఏనాటికైనా నీవే మాకు మహా గురువుగా ఉండాలి
ఎప్పటికైనా నీవే మాకు బోధించే సద్గురువు కావాలి  || ఏ గురూ || 

No comments:

Post a Comment