Thursday, August 20, 2015

ఆకాశాన ఒక రూపం మేఘంలో ఒక వర్ణం

ఆకాశాన ఒక రూపం మేఘంలో ఒక వర్ణం
క్షణ క్షణమున మారే రూప వర్ణాలు ఎన్నో
అణువణువునా మారే ఆకార రూప వర్ణాలెన్నో
ప్రతి క్షణం అణువులో దాగిన వర్ణ భావన ఏదో
క్షణాలలో మారే ఆకార వర్ణ భావాలు ఏవో
వర్ణ భావాలన్నీ ఆకాశానికి తెలియకున్నా
నా మేధస్సులో ప్రతి భావన వర్ణ కాంతిగా తోచే
విశ్వ భావాలలో వర్ణ భావాల కూటమి నాలోనే
మేధస్సుకు తోచే ప్రతి భావన ఒక విశ్వ తత్వమే
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

No comments:

Post a Comment