Friday, August 21, 2015

ఈ మేధస్సు నాది కాదు ఏ నాటికి నాది కానే కాదు

ఈ మేధస్సు నాది కాదు ఏ నాటికి నాది కానే కాదు
నేనుగా ఆలోచించుట లేదు నా కోసం ప్రయత్నించుట లేదు
నాలో దాగిన విశ్వ భావ మర్మమేదో నన్ను ఆవరించి ఉన్నది
నాలో కలిగే ఆలోచన నాకై కాక విశ్వ భావానికే అంకితమౌతున్నది
భావాలతోనే జీవించేలా నా మేధస్సు కాలాన్ని వెంబడిస్తున్నది
ఆలోచనను భావనతో గ్రహిస్తూ మేధస్సు మరో ద్రోవలో వెళ్ళుతున్నది
భావమే జీవంగా తత్వమే విశ్వంగా నా మేధస్సు ఆలోచిస్తున్నది
ఏనాటికి భావాన్ని మరచిపోగలనో ఆనాడు మరణిస్తానేమో
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

No comments:

Post a Comment