Monday, March 27, 2017

కాలమా భావమా తెలియని గమనమా

కాలమా భావమా తెలియని గమనమా
వేదమా జ్ఞానమా తెలియని తరుణమా

మానవ జీవితానికే తెలియని బంధమా
మేధస్సున ఆలోచనకే తెలియని స్వభావమా!   || కాలమా ||

గాలి ఏ వైపు వీచినా కాలం ప్రతి దేశాన సాగెనే
నీరు ఏ వైపు ప్రవహించినా సముద్రాన్ని చేరెనే

సత్యం ఎక్కడ ఉన్నా ధర్మం అక్కడే రక్షింపబడేనని
విజ్ఞానం ఎక్కడ ఉన్నా అభివృద్ధి అక్కడే సాధ్యమని  || కాలమా ||

స్నేహం సంతోషం ఎక్కడ ఉంటే అక్కడే ప్రేమ బంధాలు చిగురించేనని
భావన ఆలోచన స్వభావాలు ఉంటే వేద విజ్ఞాన తత్వాలు ఉదయించేనని

కాలం ఎలా సాగిపోతున్నా తెలియని స్వభావాలు కొత్తగా పరిచయమయ్యేనులే
విజ్ఞానం ఎలా తెలుసుకున్నా తెలియని వేదాల అనుభవాలు వింతగా తోచేనులే  || కాలమా || 

No comments:

Post a Comment