Friday, March 10, 2017

ఎక్కడ ఉన్నా కనిపించే రూపం నీవేలేనని అనుకున్నా

ఎక్కడ ఉన్నా కనిపించే రూపం నీవేలేనని అనుకున్నా
ఎలాగ ఉన్నా కనిపించే దేహం నీదేలేనని అనుకున్నా
నా కళ్ళల్లో కనిపిస్తూనే ఉన్నా కలగానే అనుకుంటున్నా   || ఎక్కడ ||

కనిపించే దేహమే నీ రూపం అపురూపమైనదే నాలో నీ భావం
కనులారా చూసే నీ ఆకారం అమోఘమైనదే నాలో నీ మోహం

ఏనాటిదో నీ రూప బంధం ఏనాటికో నీ అపురూప చిత్రం
ఎప్పటికో నీ రూప దేహం ఎప్పటిదో నీ అమోఘ తత్వం     || ఎక్కడ ||

ఎవరికి ఎవరో తెలిసినా తెలియనిదే అంతరంగం
ఎవరికి ఎవరో తెలిపినా తెలియనిదే అంతర్భావం

ప్రతి రూపంలో కనిపించే దేహం ఆకారానికే అపురూపం
ప్రతి భావంలో తపించే తత్వం స్వభావానికే అమోఘం    || ఎక్కడ || 

No comments:

Post a Comment