Thursday, March 30, 2017

స్నేహమా నీవు మరో దైవమా

స్నేహమా నీవు మరో దైవమా
స్నేహమా నీవు మరో హితమా
జీవితానికే నీవు పరమానందమా
నీవే నాలో దాగిన పర తత్వమా  || స్నేహమా ||

ఏమీ తోచని కార్యాలకు నీవే సలహా బంధమా
ఏమీ లేని రోజులకు నీవే మహా ఫల హారమా
ఏమీ కలగని సమస్యలకు నీవే పరిష్కారమా
ఏమీ కనిపించని రూపానికి నీవే ఆనందమా
ఏమీ కోరినా మార్గాన్ని చూపే మహా భావమా

మాటల పరిచయాలతో తెలిసే సమాచారమే కొత్త భావమా
జ్ఞాపకాలతో కలిసే విషయాలతో సంబంధాల స్నేహత్వమా

స్నేహం అందరికి తెలిసి తెలియని అనుభవమా
స్నేహంలో కలిగే కలహాలు మనకే గుణ పాఠమా     || స్నేహమా ||

ఎదురుగా కనిపించే రూపమే నీ స్వరూపమా
ఎక్కడ నీవు ఉన్నా నాలో ఎప్పటికి కుశలమా
ఎవరు ఉన్నా లేకున్నా నీ పలుకులే ప్రాణమా
ఎవరు రాకున్నా నీవు వచ్చే వేళయే సంతోషమా
ఎవరికి ఎవరు లేకున్నా నీ పిలుపే మహా బంగారమా

మాటల విషయాల పరస్పర సంబంధాలే స్వభావాల స్నేహమా
అవసరాల ఉపయోగాలకు తోడుగా నిలిచే వారధియే స్నేహితమా

స్నేహం ఎప్పటికి మరవని గొప్ప జ్ఞాపకమా
స్నేహం ఎప్పటికైనా ప్రతి జీవికి అనుభవమా   || స్నేహమా || 

No comments:

Post a Comment