Friday, March 3, 2017

విశ్వమే మహా ప్రకృతిగా జగమే సహజ వనరులుగా

విశ్వమే మహా ప్రకృతిగా జగమే సహజ వనరులుగా
లోకమే మహా గొప్పగా ప్రదేశమే అపురూప నిర్మాణంగా
భావ తత్వాలతో బ్రంహాండాన్ని సృష్టించావా ఈశ్వరా

విశ్వమే ప్రకృతిగా జగమే జాగృతిగా నీవే నిలిపావా ఈశ్వరా
జీవమే ఆకృతిగా కాలమే వికృతిగా సాగించావా పరమేశ్వరా  || విశ్వమే ||

ప్రకృతినే పరిశోధనతో విశ్వాన్ని పర్యావరణం చేశావా
ఆకృతినే పరిశీలనతో సజీవమైన ఆకారంగా మార్చావా

శ్వాసనే జీవంగా దేహాన్నే ఆకార రూపంగా మలిచావా
ధ్యాసనే జ్ఞానంగా పరధ్యానమే ప్రజ్ఞానంగా కల్పించావా  || విశ్వమే ||

తత్వాలతో మహాత్ములను భావాలతో మహర్షులను నెలకొల్పావా
వేదాలతో పండితులను ఉపనిషత్తులలో భోదకులను సృష్టించావా

జీవులు స్వేచ్ఛగా జీవించుటకు మహా రూపమైన సజీవ ప్రకృతిని సాగించెదవా
మానవులు విజ్ఞానంతో సాగుటకు మహా రూప నిర్మాణ వనరులను పొదిగించావా  || విశ్వమే || 

No comments:

Post a Comment