Sunday, May 29, 2016

ఊపిరి ఆగి పోయిందా ఊహ నిలిచి పోయిందా ప్రభూ!

ఊపిరి ఆగి పోయిందా ఊహ నిలిచి పోయిందా ప్రభూ!
శ్వాస ఆగి పోయిందా ధ్యాస నిలిచి పోయిందా ప్రభూ!

నీ నామ ధ్యేయములోనే వినిపిస్తున్నది ఓంకార శబ్దము ప్రభూ!
నీ ధ్యాన భావములోనే తెలుస్తున్నది ఓం నమః శివాయ ప్రభూ!   || ఊపిరి ||

నీవు నిలిచిన రూపమే విశ్వానికి ప్రతి రూపం
నీవు వెలిసిన స్థానమే జగతికి పుణ్య క్షేత్రం

నీవు లేని శ్వాస ఏ జీవికి నిలవదుగా దేహం
నీవు లేని ధ్యాస ఏ జీవికి కలగదుగా భావం

నీవు తలచిన దైవమే ఈ లోకం
నీవు నడచిన ధర్మమే ఈ సత్యం  || ఊపిరి ||


నీవు లేని లోకము మాకు ఓ శూన్యము
నీవు లేని జగతి మాకు దుఃఖ సాగరము


నీవు లేనిదే కాలము క్షణమైనా సాగదు
నీవు లేనిదే కార్యము విజ్ఞానమై సాగదు


నీవు చూపే దారిలోనే వెలుగును చూస్తున్నాము
నీవు తెలిపే భావనలోనే విజ్ఞానాన్ని గ్రహించాము  || ఊపిరి ||

No comments:

Post a Comment