Friday, May 13, 2016

అరె ఏమైందీ ..... ఒక మనిషికి ఈనాడే జీవితం ముగిసిందీ

అరె ఏమైందీ ..... ఒక మనిషికి ఈనాడే జీవితం ముగిసిందీ
అరె ఏమైందీ ..... ఒక హృదయం నేడే భావనతో నిలిచిందీ

ఏనాడు ఏమౌతుందో ఏ క్షణం ఏమౌతుందో ఏ జీవికి తెలియదుగా
ఏ భావంతో ఏ జీవితం ఎప్పుడు ఆగి పోతుందో ఎవరికి తెలియదుగా

భావాలతో జీవిస్తున్నా మౌనంతో సాగే హృదయం ఆగిపోయేనుగా
బంధాలతో జీవితాలు అల్లుకున్నా ఒంటరిగానే వదిలి వెళ్ళేనుగా

శిఖరమై ఎదిగినా పర్వతమై నిలిచినా ఏనాటికైనా ఒంటరియేగా
వృక్షమై ఒదిగినా ఆకాశమై విస్తరించినా ఎప్పటికైనా ఒకరేగా       || అరె ఏమైందీ ..... ||

భావాలతో బంధాలు సాగుతున్నా జీవితాలు ఆగిపోయేనుగా
బంధాలతో జీవితాలు ఎదుగుతున్నా భావాలతో నిలిచేనుగా

జీవితాలు ఏవైనా అనుభవంతో సాగే భావాలే అనుబంధమయ్యేనుగా
అనురాగాల సంబంధాలే అనుబంధంతో జీవితాలు ఆకట్టుకొనెనుగా

విశ్వమంతా ఎదిగినా జగమంతా నిలిచినా మరణం ఓనాడు సంభవించేనుగా
లోకమంతా ఉదయించినా ఆకాశంతో ప్రయాణించినా జీవం అస్తమించేనుగా || అరె ఏమైందీ ..... ||

No comments:

Post a Comment