Tuesday, May 31, 2016

ఓ బాటసారి .....

ఓ బాటసారి .....
ఇది నవ్వుతూ నడిచే రహదారి కాదయ్యా
ఇది అనుభవంతో నడక నేర్చే మహాదారయ్యా  || ఓ బాటసారి .....  ||

ఎందరో అడుగులు వేస్తూ ఉంటారు పడి పడి పోతూ లేస్తారు
ఎన్నో సార్లు పడి  పడి లేచినా సాగించే ప్రయాణమే ఈ దారి

జీవితమంతా ప్రయాణించినా అనుభవం చాలదయ్యా
జీవనమే మార్గమని తలచినా అడుగులు తప్పి పోవునయ్యా

ఏనాటికి తెలియని పరిమాణమే దారిలో తెలియని నవ సూత్రాలు
ఏనాటికి తెలియని పరిశోధనమే మార్గంలో తెలియని  విధానాలు   || ఓ బాటసారి .....  ||

భావంతో నడిచినా భాష్పంతో సాగించినా
జ్ఞానంతో నడిచినా విజ్ఞానంతో సాగించినా

మనిషికే తెలియని అన్వేషణ
మేధస్సుకే తెలియని ప్రతి ఘటన

ఏ సమయంలో నీవు మరణిస్తావో నీ గమ్యం ఎక్కడని తెలియదుగా
ఏ క్షణంలో నీవు జన్మించావో నీ స్థానమే ఏదని గమనించ లేదుగా   || ఓ బాటసారి .....  || 

No comments:

Post a Comment