Monday, May 23, 2016

ఓ బాటసారి ....

ఓ బాటసారి ....
నీటిలో ప్రయాణమా రహదారిలో ప్రమాదమా
రహదారిలో అడుగు వేస్తే నడవడి మారిపోవునా
నీటిలో అలలు వస్తే నావ తిరగబడి పోవునా  || ఓ బాటసారి .... ||

వర్షం వస్తే రహదారి చిందర వందర అగునా
నదిలో నావ చీటికిమాటికి అటుఇటు తిరుగునా

రహదారిలో దిక్కులు తోచినా అడుగులు వేయలేవా
నీటిలో దిక్కులు తోచకున్నా ఏ దిక్కున సాగి పోలేవా

ఇది జీవన ప్రయాణంతో సాగే జీవిత పోరాటం
ఇది మౌనంతో సాగే హృదయ వేదన సాగరం || ఓ బాటసారి .... ||

అలలతో సాగే నావ ఆగిపోతే అడుగులు వేసే రహదారి తీరం చేరుకోవా
కలలతో సాగే జీవితం కలతతో ఆగితే మరో కొత్త ప్రయాణం చేయలేవా

మారిపోయే కాలంతో మనిషే మారకపోతే ఏ జీవి నిన్ను మార్చునో
ప్రతి జీవిలో ఉన్న పరమార్థమే నీ మేధస్సుకు అనుభవమైనదేమో

సాగించే ప్రయాణం ఏదైనా ఓర్పుతో ధైర్యంగా సాగిపోవాలి
కాలంతో ప్రమాదం అనుకున్నా అజ్ఞానాన్ని వదులుకోవాలి || ఓ బాటసారి .... ||

No comments:

Post a Comment