Thursday, May 26, 2016

ఏది నీ ధ్యేయం ఏది నీ లక్ష్యం ఏది నీకు సాధ్యం తెలుసుకో ఓ మిత్రమా

ఏది నీ ధ్యేయం ఏది నీ లక్ష్యం ఏది నీకు సాధ్యం తెలుసుకో ఓ మిత్రమా
తెలిసినది విజ్ఞానం తెలియనిది అనుభవం సాధన చేసుకో ఓ భావమా    || ఏది నీ ధ్యేయం ||

అన్నీ తెలిసి ఉన్నా తెలియనిది మరో కొత్తగా కాలంతో వస్తూనే ఉంటుంది
కాలంతో మారిపోయే అలవాట్లతో వచ్చి పోయేవి ఎన్నో మేధస్సుకే తెలియాలి

విజ్ఞానం సౌందర్యం అలంకారం అనుభవించడం ఇవేనా మన సౌకర్యం
సృష్టించడం సుధీర్గ కాలం శ్రమించడం ఇవేలే మనకు అసలు సిసలు

విజ్ఞానానికి కొదవ లేదు అనుభవానికి తావు లేదు ఎక్కడైనా తెలియని విధమేలే
అందరికి అన్నీ అందక పోయినా అవసరమయ్యేవి అందించాలి ఓ మిత్రమా  || ఏది నీ ధ్యేయం ||

సాధనతో  సాధ్యం చేసుకోవడమే మన కర్తవ్యం
దీక్షతో శ్రమించడమే మన జీవిత పర మార్థం

అన్వేషించడంలోనే ఉన్నది నవ జీవన విజ్ఞానం
నీవుగా ఎదిగి ఎందరికో దారి చూపడమే సంపూర్ణం

నీతో ఉన్నది నలుగురికి చెప్పడమే విజ్ఞాన సోపానం
నీకు మరల కొత్త అనుభవం కలగడమే కాల తత్త్వం

నీ ధ్యేయం ఓ విజ్ఞాన విశ్వ గ్రంథం
నీ లక్ష్యం నవ జీవన విధాన సంపూర్ణత్వం
నీ సాధన ప్రతి క్షణం అనుభవంతో జీవించడం || ఏది నీ ధ్యేయం ||

No comments:

Post a Comment