Wednesday, December 30, 2009

సమాజాన్ని మార్చగలవా మారగలవా

సమాజాన్ని మార్చగలవా నీకు నీవే తెలుసుకొని మారగలవా -
రాళ్లనే విసిరినావు అద్దాల మేడలే పగిలిపోయీ ఎందరికో గాయమైనది -
గాజు ముక్క కంటిలోనే కదులుతున్నా శరీరాలెన్నో రక్తపు ధారలైనాయీ -
ఎన్నిటినో ఎక్కడెక్కడో పేల్చివేసి రహదారులను అడ్డగించి కార్యములెన్నో నిలిపావు -
చిన్ని పాప ఒంటరిగా కాలిపోతుంటే కన్నీరు లేని నీకు త్రాగడానికి నీరెందుకో -
నీ స్నేహితులే బంధువులే భాద పడుతున్నా అజ్ఞానంతో తెలియక చేస్తున్నావు -
చికిత్స లేక భాధలు పెరిగి క్షణం క్షణమున ఎందరో మరణిస్తుంటే ఆహారమే ఎందుకు నీకు -
గుంపులుగా రహదారిలో నడిచే మీకు ఆవేశాలు ఎందుకో అనర్థాలతో చేసే పనులేమిటో -
ఇంటికే తిరిగి వెళ్ళే నీవు శవాన్నే చూసినా రాయి తోనే విసిరి కేరింతలు చేస్తావు -
ఇంటిలోని వారినే హింస పెట్టి దాహమైనా మధ్యమునే సేవించి సమాజాన్నే స్మశానం చేస్తున్నావు -
అవసరంలేని ఉద్యమాలు ఎన్ని వస్తున్నా నీవు పాల్గొని రెచ్చ గొట్టడమెందుకో -
రెచ్చిపోయే నీ ఆవేశాలకు ఎందరో ఎన్నో చేసే అనర్థాలకు నీలో భయం రాదా -
సమాజాన్నే మార్చే ఆలోచన నీలో ఉంటె అధికారం లేక కృషితో శాంతిగా ఒంటరిగా జయించూ -
నీ మాటలే వినలేక ఎవరూ మారలేకపోతే తల్లిలా ఎదుటివారికి నీ గుండె ఓదార్పులా తెలుపు -
ఆయుధము నీకు ఆవేశం లేని మాటేగాని మరో ఆయుధాన్ని కూడా ఎదుటివారికి కలిగించవద్దు -
నీకు మార్చే శక్తి కావాలంటే నాలో నిక్షిప్తమైనా ప్రణాళిక దివ్యంగా దాగి యున్నది -
ఆయుధమంటే భయపడేల నీలో భక్తి భావం ఉన్నప్పుడే శాంతి తత్వం ఉదయిస్తుంది -
హింసనే వీడినప్పుడే నీలో హంస చేరి విశ్వశాంతి విజ్ఞానంలా సమాజానికి తెలుపుతుంది -
నా మాటలతో నీవు మారకపోతే నా విజ్ఞానం మార్చకపోతే శ్వాసనే విడవగలవా ఆలోచనగా -
నా భావన నీలో కలిగే వరకూ నీకు నీవే మార లేవూ సమాజాన్ని అసలే మార్చలేవూ -
నీవు మారకపోతే అర్ధరాత్రి వేళ అడవిలో ఒంటరిగా నడిచే చిన్ని పాపను అడుగు -
సమాజంలో ఎందరిలో ఎన్ని వ్యత్యాసాలున్నా నీకు నీవే గొప్పని ఎదిగిపో ఒదిగిపో -
సంస్కారం గౌరవం మానవత్వం క్రమశిక్షణ అందరిలో చిన్న వయసునుండే జ్ఞానపరచు -

సమాజాన్నే శుభ్రతగా ఉంచు కాలుష్యాన్ని తగ్గించూ ఏ వస్తువు ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉంచు -
మృగాన్ని కూడా స్నేహంగా భావించి మానవులే మహాత్ములుగా ప్రపంచానికి తెలియపరచు -
నీవు ప్రకృతినే ప్రేమిస్తే నవ సమాజానికి విశ్వమే సరైన ఋతుపవనాలతో ఆహ్వానమిస్తుంది హృదయమా!

2 comments:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete
  2. really Ultimate and everybody should think about the points raised.

    ReplyDelete