Wednesday, September 7, 2016

జై గణేశ శ్రీ గణేశ జయహో జై గణేశ

జై గణేశ శ్రీ గణేశ జయహో జై గణేశ
జై గణేశ ఓం గణేశ జయహో జై గణేశ
జయహో గణేశ జయ ఓం శ్రీ గణేశ
జయహో జయహో జయహో గణేశా ...  || జై గణేశ ||

జయమే విజయమై అభయమిచ్చే జై గణేశ
దైవమే సత్యమై ధర్మాన్ని రక్షించే జై గణేశ

అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని ఇచ్చే శ్రీ గణేశ
విధినే మార్చేసి నూతన భవిష్యత్ ను ఇచ్చే శ్రీ గణేశ

స్నేహంతో బంధాలను కలిపే ఓం గణేశ
బంధాలతో ప్రేమనే పంచేసే ఓం గణేశ  || జై గణేశ ||

విశ్వానికి నీవే ఆది గణపతి జగతికి నీవే మహా గణపతి
లోకానికి నీవే వేదం సృష్టికి నీవే జ్ఞానం ఓ మహా గణపతి

మేధస్సులో ఆలోచన నీలోని విశ్వ విజ్ఞానమే
హృదయంలో భావన నీలోని జీవన తత్వమే

ప్రకృతికే ప్రతి రూపమై వరమునే ఇచ్చెదవు
దేహానికే మహా స్వరమై ధైర్యాన్ని ఇచ్చెదవు   || జై గణేశ ||

No comments:

Post a Comment