Tuesday, September 27, 2016

నడిచే దారిలో సత్యం లేదు ప్రయాణించే మార్గంలో ధర్మం లేదు

నడిచే దారిలో సత్యం లేదు ప్రయాణించే మార్గంలో ధర్మం లేదు
మరచిపోలేని విజ్ఞానం లేదు మరణించే అజ్ఞానం ఎవరికి లేనే లేదు || నడిచే దారిలో ||

అశాశ్వితంతో అశాంతతను సృష్టించే మానవ జీవితత్వం
ఆశామోహంతో అభివృద్ధిని అణిచే మానవుల జీవనతత్వం

ఎవరికి వారు ఎదుగుతూనే స్వార్థంతో జీవిస్తున్నారు
ఎవరికి వారు ఒకరై తమ కోసమేనని ఆలోచిస్తున్నారు  || నడిచే దారిలో ||

సహాయం లేని చోట స్థానం నిరుపయోగం సలహా ఐనా శూన్యం
ఆదరించని జీవితం అనర్థం అనవసరం జీవనం మహా కఠినం

ప్రయాణం కాలంతో సాగినా అలసిపోయే రోజులతో ఆహారం లేక సొలసినదే దేహం
విజ్ఞానం ఉన్నా ఆచరణ అజ్ఞానమై మరణం వరకు సాగెనే అస్థికములతో మన శరీరం || నడిచే దారిలో || 

No comments:

Post a Comment