Wednesday, September 7, 2016

ఒక భావన ఒక వేదన ఒకటే ఆవేదన

ఒక భావన ఒక వేదన ఒకటే ఆవేదన
ఒక ప్రార్థన ఒక సాధన ఒకటే ఆలోచన   || ఒక భావన ||

ధీక్షతో సాగే సాధన శ్వాసతో సహాసమే చేసే
దేహంలో కలిగే వేదన దైవంతో సమరం చేసే

మనస్సులో ప్రశాంతం సాధనకు సమ్మోహం
మేధస్సులో సుఖ శాంతం ధీక్షకే మహా సంభోగం   || ఒక భావన ||

ధీక్షతో సాగే మహా కార్యం సహాసంతో సాగే కర్తవ్యం
ఏకాగ్రతతో సాగించే ధ్యానం యోగంతో కలిగే మోక్షం

ప్రతి కార్యం ఒక మహా వేదం మహాత్ములకు వేదాంతం
ప్రతి భావం ఒక మహా కావ్యం మహర్షులకు విశ్వ తత్త్వం  || ఒక భావన || 

No comments:

Post a Comment