Friday, September 23, 2016

సిరిమల్లె పువ్వా సింధూర పువ్వా సిరి వెన్నెలలో నవ్వవా

సిరిమల్లె పువ్వా సింధూర పువ్వా సిరి వెన్నెలలో నవ్వవా
చామంతి పువ్వా చిన్నారి పువ్వా చిరు గాలితో సిగ్గు పడవా

విరబూసే పువ్వులా విల విలమంటూ నవ్వుతూ పూయవా
కల కలమంటూ గల గలమంటూ సుగంధంతో పూయవా  || సిరిమల్లె ||

పువ్వులా విరబూసే నీ నవ్వులో సుగంధాల సుమధురమే దాగున్నదా
పుష్పంలా వికసించే నీ రంగులో సువర్ణాల మేలిమి వర్ణం దాగున్నదా

మొక్కలలోనే మొగ్గవై ప్రతి రోజూ పూల తోటలో పదిలంగా పూసెదవా
మొక్కలలోనే మక్కువై ప్రేమికులకు నీవే ప్రశాంతతను పంచెదవా   || సిరిమల్లె ||

ప్రతి గాలి శ్వాసలో నీవే పుష్పాల సుగంధమై మనస్సునే దాచెయ్యవా
ప్రతి చోట గాలితో నీవే మధురమైన సుగంధాన్ని శ్వాసకు అందించవా

సిరి జల్లుల తోటి  కురిసే వేళ పూచే నీ లేత సువాసనతో మైమరిపించావా
ప్రాణ వాయువును నీవే సువాసనలతో స్వచ్ఛంగా ప్రతి జీవికి అందించవా  || సిరిమల్లె ||

No comments:

Post a Comment