Wednesday, September 7, 2016

ప్రకృతిలో జీవించు ప్రకృతినే ప్రేమించు

ప్రకృతిలో జీవించు ప్రకృతినే ప్రేమించు
ప్రకృతినే పెంచేసి ప్రకృతినే మెప్పించు
ప్రకృతియే జగతికి ప్రాణ వాయువుగా నిలిచేను ప్రతి జీవిలో  || ప్రకృతిలో ||

ప్రకృతి మనకే ప్రమోదం ప్రకృతియే మన ఆరోగ్యానికి ప్రశాంతం
ప్రకృతియే మన లోకం ప్రకృతియే మన దేహానికి మహా ప్రసాదం

ప్రకృతి నుండే మన జీవితం ఆరంభం ప్రకృతిలోనే మన జననం
ప్రకృతి నుండే మన జీవనం ప్రారంభం ప్రకృతిలోనే మన కాలం  || ప్రకృతిలో ||

ప్రకృతిలోనే వెలిశారు ఎందరో మహానుభావులు మహాత్ములుగా అవతరించారు
ప్రకృతిలోనే నిలిచారు ఎందరో మహర్షులు మాధవులుగా ఎంతో అధిరోహించారు

ప్రకృతిలోనే పరమాత్మ ప్రకృతిలోనే పరబ్రంహ పకృతితోనే ప్రతి సృష్టి
ప్రకృతిలోనే దేవాత్మ ప్రకృతిలోనే విశ్వాత్మ ప్రకృతిలోనే ప్రతి జీవి రూపం  || ప్రకృతిలో || 

No comments:

Post a Comment