బంధం ఉన్నవారికి నన్ను కలవాలనే ఆలోచన నేడు లేకపోతే
ఇక నన్నెప్పుడు కలవలేనట్లు విశ్వానికి దూరమై జీవిస్తాను
ఏ బంధం దూరమైనా నా మనస్సు మీ మేధస్సుకై జీవిస్తుంది
మీ జీవితాలను సాగించేందుకే ప్రతి క్షణం మీలోనే ఉంటాను
నన్ను కలవాలని ఏనాడైనా అనుకున్నా కానరాని దూరంలో పలకరిస్తాను
ఎవరు ఎక్కడున్నా నా భావన మీ జీవితంలో ప్రయాణిస్తూనే ఉంటుంది
0 comments:
Post a Comment