Monday, February 6, 2017

ఎక్కడ ఉన్నానో ఎలా ఉన్నానో ఏ భావ తత్వాలు నాలో జీవిస్తున్నాయో

ఎక్కడ ఉన్నానో ఎలా ఉన్నానో ఏ భావ తత్వాలు నాలో జీవిస్తున్నాయో
ఎక్కడ ఎలా ఉంటానో ఏ దేహ రూప స్వరూపాలు నాలో ఉదయిస్తున్నాయో
పర దేహ రూప ప్రకృతిలో ఆకార నిర్మాణమై విశ్వ జగతిలో అనంతమైపోయానో  || ఎక్కడ ||

జీవంలోనే శ్వాసనై ఇమిడిపోయాను
శ్వాసలోనే ధ్యాసనై మిళితమయ్యాను
ధ్యాసలోనే ధ్యానమై మిగిలిపోయాను

ధ్యానంలోనే పరభావమై కలిసిపోయాను
పరభావంలోనే పరతత్వమై మిశ్రమమైపోయాను

పరతత్వంలోనే పరంధామనై సంయోగమయ్యాను
పరంధామలో పరమాత్మమై సంభోగమయ్యాను

పరమాత్మములోనే పరంజ్యోతినై పరిశోధనమయ్యాను
పరిశోధనలోనే నిత్యం అనంతమై శూన్యమయ్యాను
శూన్యములోనే పరిశుద్ధమైన సూక్ష్మమై బ్రహ్మాండమైపోయాను    || ఎక్కడ ||

ప్రకృతిలోనే పరంధామనై పరిశోధనమయ్యాను
రూపాలలోనే పరభావమై నిర్మాణమైపోయాను

సృష్టిలోనే దేహ జీవమై దైవమైపోయాను
విశ్వంలోనే కాలమై వసంతమైపోయాను
జగతిలోనే జన్మనై రూపాంతరమైపోయాను

వేదంలోనే ఉపనిషత్తులనై ఒదిగిపోయాను
విజ్ఞానంలోనే ప్రజ్ఞానమై పరిశోధనమయ్యాను
అనుభవంలోనే కాలచక్రమై సుదర్శనమయ్యాను

వెలుగుతో సూర్యోదయమై ఉత్తేజ కార్యకుడైనాను
చీకటితో అస్తమై దేహాలకు ప్రశాంత విశ్రాంతినయ్యాను  || ఎక్కడ || 

No comments:

Post a Comment