ఏ మనిషి ఐతేనేమి ఏ జీవి ఐతేనేమి ప్రతి రోజు ఆహారం నిద్ర అవసరమే
ఆహార నిద్రలు అవసరం లేదంటే చెప్పండి మహా గొప్పగా ఆలోచిద్దాము
ప్రతి ఒక్కరు సమానమే ఈ రోజు కొందరికి కొన్ని హోదాలు సౌకర్యాలు
రేపు మరి కొందరికి మరిన్ని హోదాలు మరెన్నో సౌకర్యాలు కలుగుతాయి
నేడు ఈర్ష పడవద్దు రేపటికి స్వార్థంగా ఆలోచించవద్దు అనుభవంతో సాగిపో
నేడు జీవించుటలో హిత భావాలు గల విజ్ఞానం ఉండాలి అదుంటే చాలు
అజ్ఞానం కలవారు విజ్ఞానంగా మారేందుకు ప్రయత్నించాలి మార్పు వస్తుంది
నేడు కొందరు అజ్ఞానులు విజ్ఞానంగా మారుతుంటే చాలా గొప్పగా ఉంది
మరికొందరు విజ్ఞానులు అజ్ఞానంగా మారుతుంటే చాలా విచారంగా ఉంది
ఏమిటో ఈ మేధస్సు ప్రభావం కాల జ్ఞానంలో కర్మ భావమేమో తెలియదు
నిర్దిష్టమైన సంకల్ప సిద్ధి స్వయం కృషి పట్టుదల హిత గుణాలు లేవేమో
విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించే వారికే మహా దివ్య భావాలు కలుగుతాయి
No comments:
Post a Comment