కాలం ఎప్పుడూ నీకు నీవుగా ఎదగాలనే సూచిస్తుంది అనుభవంతో తెలుసుకో
ఆనాడు ప్రోత్సాహంతో సాహయం చేసి సహకరించిన వారు ఎందరో ఉండవచ్చు
నేడు ప్రస్తుత పరిస్థితులలో తాత్కాలికంగా సలహాలే గాని సహాయాలు లేవు
ఎవరి జీవితం వారిది ఎవరి ఆలోచన వారివి ఎవరి సంతోషాలు కష్టాలు వారివే
నీకు తెలిసిన విధంగానే నీకున్న విజ్ఞానంతో సాగిపో కాలం ఎప్పటికైనా సహకరిస్తుంది
నిరాశ చెందకు ఆశతో ఇంకొకరి అద్భుతాలకు ఉప్పొంగిపోవద్దు అనుభవమే గుణపాఠం
నీకు నా భావనయే మహాత్మగా తోడుగా ఉంటుంది విజ్ఞానంగా స్వయంకృషితో సాగిపో
No comments:
Post a Comment