Saturday, January 29, 2011

తలచి తలచి చూస్తే

తలచి తలచి చూస్తే నా తల్లి మహాత్మురాలిగా నా మేధస్సులోనే
జగమునే నా తల్లికి ఇచ్చి విశ్వ భావ ఋణ బంధాన్ని పెనవేసుకోనా
నా విశ్వ విజ్ఞాన భావాలకు నా తల్లి తత్వమే నా జన్మ భావ రూపం
నేను ఎదిగే విశ్వమున నా రూపం నా తల్లి భావనతోనే నిలిచిపోతుంది
నేను తలచుకొనే ప్రతి భావనలో నా తల్లి గుణమే నాలో కలుగునని నా అర్థం
బంధాలు ఎంతటివో విశ్వాత్మకే తెలిసిన బహు స్వభావాల ఆత్మ తత్వములే
వీడలేని బంధాలతో కను రెప్పల గుర్తులతో ఎదురు చూసే నీడలే మాతృతత్వం

No comments:

Post a Comment