Monday, January 31, 2011

విశ్వమున సూక్ష్మ జీవుల పరిస్థితి

విశ్వమున సూక్ష్మ జీవుల పరిస్థితి ఎవరికి తెలియును
ఎవరైనా గ్రహించారా తెలుసుకున్నారా స్పందించారా
క్షణానికి ఎన్ని ఎలా జన్మిస్తాయో ఎలా ఎన్ని మరణిస్తాయో
జీవించుటలో కలిగే విశ్వ ప్రభావాలకు ఎన్ని ఇబ్బందులో
మానవుడు సృష్టించే కాలుష్యానికి ఎన్ని ఎలా ఎప్పుడు మరణిస్తాయో
సూక్ష్మ జీవుల భాధలలో ఓ భావన నైనా గ్రహించావా
నీ ఆత్మ తత్వానికి తెలియుట లేదా ఆత్మీయ జీవత్వము
నేను కూడా అందులో ఒక భాగ స్వామిగా ఆలోచిస్తున్నా
నేను గొప్పవాడిని కాదు నేను మీలాగే ఆలోచిస్తుంటే తెలిసింది
సూక్ష్మ జీవులు కూడా మనకు చాలా ఉపయోగపడుతాయి
ప్రాణ వాయువును కలిగించేవి సుగంధాన్ని ఇచ్చేవి ఉంటాయి
కాలుష్యాన్ని ప్రాణవాయుగా మార్చేవి కూడా సూక్ష్మ జీవులే
గాలిలో ఉన్న అణువులే సూక్ష్మ జీవులుగా జీవిస్తున్నాయి
మనకు కనిపించే చిన్న జీవులు కూడా విజ్ఞానాన్ని అందిస్తాయి
విజ్ఞానంలో ఎన్నో భావ స్వభావాలు విశ్వ తత్వాలు ఉంటాయి
ప్రతి జీవి ఎందుకు జీవిస్తుందో చరిత్రగా తెలుసుకుంటే ఎన్నో ఉపయోగాలు
ప్రతి జీవి జీవిత చరిత్రలో విశ్వ విజ్ఞానం ఎంతో ఉంటుంది
సూక్ష్మంగా ఆలోచిస్తే తప్ప సూక్ష్మ జీవుల విజ్ఞానం తెలియదు
అన్ని జీవులను మానవుడే చూసుకోవాలి భవిష్య విజ్ఞానానికి
అన్నింటిని విశ్వ విజ్ఞానంతో విశ్వ భావ తత్వాలతో గ్రహించండి
జీవితాన్ని విశ్వ విజ్ఞానం వైపు ప్రయాణాన్ని సాగిద్దాం

No comments:

Post a Comment