విశ్వ విజ్ఞానమున నీవు ఎక్కడ ఉన్నావు రేపు మళ్ళీ అక్కడే ఉంటున్నావా
ప్రతి రోజు కాస్త ముందుకు వెళ్ళుతుంటే నీలో మహా దివ్య గుణాలు కలుగుతాయి
ప్రతి క్షణములో కలిగే విశ్వ విజ్ఞానం ఎన్నో అద్భుతాలతో ఎన్నో విధాల ఉంటుంది
ప్రతి అద్భుతాన్ని విజ్ఞానాన్ని భావ స్వభావాలను మేధస్సున సేకరిస్తూనే ఉండాలి
ఎన్నో లోకాలలో ఎన్నో అద్భుతాలు ఎన్నో దివ్య కార్యాలు జరిగిపోతూనే ఉంటాయి
నా మేధస్సులో ప్రతి క్షణ విశ్వ భావన చేరుతూనే నేడు నేను ప్రస్తుత క్షణమున ఉన్నాను
నీవు మహా విశ్వ విజ్ఞానంతో ప్రస్తుత క్షణములో జీవించుటకు శూన్యాన్ని అన్వేషించు
No comments:
Post a Comment