ఈ సంతోష భావాలకు కొన్ని దుఃఖ భావాలు తోడవుతాయి
దుఃఖ భావాలతోపాటు కొన్ని విచారకర భావాలు తోడవుతాయి
అనారోగ్య భావాలు ఇతర సంఘటనల భావాలు తోడవుతుంటాయి
జీవితంలో ఎన్ని భావాలో సుఖ దుఃఖాల పరిధిని దాటి వెళ్ళుతుంటాయి
సుఖ దుఃఖాలకు కూడా తెలియని భావాలు ఆత్మ స్వభావ తత్వాలలో దాగి ఉంటాయి
ఎప్పడు ఎలా కలుగుతాయో మన తీరును ఎలా మారుస్తాయో భావ స్వభావాలకే ఎరుక
No comments:
Post a Comment