మరణించే శరీరం జన్మించే ఆత్మ నీకు జీవమై జీవించుటలో నీకు తెలిసినదేమి
యుగాలుగా నీతో వచ్చే శరీరాలెన్నో ఆత్మ ధరించే శరీర రూపాలెన్నో తెలుసుకో
మరణిస్తావని తెలుసు జన్మించావని తెలుసు జీవితమే ఎందుకో తెలుసుకోవు
మానవుడిగా నీకు తెలియకపోయినా మహాత్మగా నీ ఆత్మకు ఎన్నో తెలుసు
నీ ఆత్మయే పరమాత్మగా విశ్వాన్ని సృష్టించి ఎన్నో రూపాలను నిర్మించినది
నీ ఆత్మ ఓ శరీరాన్ని ధరిస్తే నీకు ఏ విషయాలు తెలియకుండా పోతాయి
విశ్వమున ఏమి జరిగినా ఎవరి మేధస్సులో ఏమున్నా నీకు తెలియవులే
శరీరం ఓ అజ్ఞాన మర్మ కవచముగా నీ ఆత్మకు మరుపు గలిగిస్తుంది
అందుకే మానవ జీవిగా మేధస్సు విజ్ఞానంతో ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకో
ఆత్మ జ్ఞానంతో విశ్వ విజ్ఞానిగా నీకు అన్ని విషయాలు తెలుస్తూ వస్తాయి
No comments:
Post a Comment