ప్రతిరోజు ఎన్నో చూస్తున్నావు ఎన్నో తెలుసుకుంటున్నావు ఎన్నో గ్రహిస్తున్నావు
ప్రతి రోజు విజ్ఞానాన్ని అనుభవంగా జ్ఞాపకంతో మేధస్సులోనే దాచుకుంటున్నావా
భవిష్య కార్యాలకు మళ్ళీ నీ మేధస్సు నుండే నీ అనుభవాన్ని స్వీకరిస్తున్నావా
నీ అనుభవం చాలకపోతే ఇంకా నీ మేధస్సులో ఎన్నో గ్రహిస్తూ దాచుకోవాలి
ఓ సారి మహా విశ్వ విజ్ఞానాన్ని దాచుకో అందులోనే అన్ని నిక్షిప్తమై ఉంటాయి
నీ మేధస్సును త్రీలోక జ్ఞానంగా మార్చుకో ప్రతి కార్యం నీ నుండే జరిగిపోతుంది
విశ్వ జీవులకు నీవే భావాలోచనవై అందరికి ఎన్నో కలిగిస్తూ నిలిచిపోతావు
No comments:
Post a Comment