నా మనస్సులోని మర్మములను తెలుసుకోవాలనే నా మేధస్సు అన్వేషిస్తున్నది
నా అన్వేషణ లోనూ మనస్సు అన్వేషణను మారుస్తూ మరో దానిపై మరలుతుంది
మనస్సు చలించే భావ స్వభావాల విధానంతో సూక్ష్మ ప్రభావాలను గమనిస్తున్నా
మనస్సు తెలుసుకునే విజ్ఞాన అర్థాన్ని తొలగించుకునే అజ్ఞానాన్ని గ్రహిస్తున్నా
ఏది మంచిదో ఏది మంచిది కాదో అర్థమయ్యేలా అన్ని గుణ విచక్షణాలను గ్రహిస్తున్నా
విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించే ఆధ్యాత్మ భావాలను సూక్ష్మంగా ఆలోచిస్తూ అన్వేషిస్తున్నా
No comments:
Post a Comment