శూన్య స్థితి కోసమే విశ్వ స్థితిని గమనించాలి
ఆత్మ స్థితి విశ్వ స్థితిగా శూన్య స్థితిలో చేరుతుంది
శూన్య స్థితిని చేరుకున్న వారు మహా తత్వాలచే జీవిస్తారు
మహర్షులుగా విశ్వ విజ్ఞానులుగా యోగ భావాలతో జీవిస్తారు
శూన్య స్థితి ఎన్నో కోట్ల జీవులలో చాల అరుదుగా ఎన్నో యుగాలకు ఒకరికి లభిస్తుంది
ఒకరి కంటే ఎక్కువగా లభిస్తే విశ్వమున ఎందరో మహర్షులు జీవిస్తున్నారనే నా భావన
శూన్య స్థితి కలగకున్నా విశ్వ స్థితితో విశ్వ విజ్ఞానంగా జీవించాలనే నా దివ్య భావాలోచన
No comments:
Post a Comment