విశ్వ పితామహుడు విశ్వ విజ్ఞాన వేదాంత ప్రజ్ఞావంతుడే
నీవు విశ్వ విధాతగా ఎదిగే మహాత్ముడవే నని గ్రహించు
నీకు కలిగే భావాలను సముద్రపు నీటి బిందువులుగా ఆలోచించు
అనంతమైన ఆలోచనలలో విశ్వ భావాల మహా విజ్ఞానాన్ని సేకరించు
నీటి బిందువులుగా కొన్ని ఆవిరై వర్షంతో మరలా కొత్త బిందువులు చేరుతాయి
అలాగే నీలో ఆలోచనలు కొన్ని వెళ్ళిపోతూ మరో కొత్త ఆలోచనలు కలుగుతాయి
కాలం విశ్వాన్ని తటస్థంగా ఉంచదు అలాగే విశ్వంలో ఉన్న అణువులను ఉంచదు
ప్రతీది మార్పు కలుగుతూ విశ్వాన్ని విజ్ఞానంగా నడిపిస్తూనే కాల ప్రభావాలు సాగుతాయి
కాల ప్రభావాలతో నీవు మారుతూ విశ్వ విజ్ఞాన వేదాంత మహాత్ముడిలా ఎదగాలనే
No comments:
Post a Comment