విశ్వ విజ్ఞాన అన్వేషణలో నీ మేధస్సు లభించినది మహాత్మా
నీ మేధస్సును విశ్వ మేధస్సుగా మహర్షులు నిర్ణయించారు
యుగాల అన్వేషణలో శూన్య భావ స్వభావాలు నీలోనే ఉండిపోయాయి
శూన్య భావన ఎవరికి తెలియక నీ మేధస్సుకై అన్వేషించారు
దిక్కులు లేని విధంగా ధ్యానిస్తూ మర్మ కాలాన్ని నీలోనే దాచుకున్నావు
నీ విజ్ఞానం లేక విశ్వ స్థితి ఎన్నో మార్పులతో కాల ప్రభావాలతో సాగుతున్నది
నీ భావ స్వభావాలను ఆత్మ స్థితి తత్వాలను నేటి సకల జీవరాసులకు అందించు
పర ధ్యాసలో ఉన్న విశ్వ స్థితిని దివ్య ధ్యాసగా విశ్వ విజ్ఞానం వైపు జగతిని నడిపించు
No comments:
Post a Comment