యదార్థంగా ఉన్న రూపాల ఆకారాలను చిన్నవిగా లేదా పెద్దవిగా
చూపే యంత్రములు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఉన్నాయి
ఇంకా ఎన్నో విధాల సూక్ష్మ యంత్రాలు వస్తూనే ఉంటాయి
అరచేతి యంత్రాలు దూర దర్శనములు చిత్ర తెరలు గా ఎన్నో వస్తూనే ఉన్నాయి
భావాల ఆలోచనలతో పరికరాల స్పర్శా విజ్ఞానంతో యంత్ర భాషతోనే ఎన్నెన్నో
ఎన్నో విధాల మనిషి ఆలోచనలు సూక్ష్మంగా రోజు రోజుకు పెరుగుతున్నాయి
నేటి సూక్ష్మ విజ్ఞానం మాయా చిత్ర విజ్ఞానంగా తక్షణ సమాచారాలను అందిస్తున్నాయి
కృషి ఒకరిది ఫలితం ఒకరిది ఆలోచనలు ఒకరివి విజ్ఞానం మరొకరిది ఖర్చు ఇంకొకరిది
వస్తువులు ఒకరివి ప్రయోగం ఇంకొకరివి అవకాశం ఒకరిది సదుపాయాలు మరొకరివి
తయారు చేయడం ఒకరు అమ్మడం కొనుక్కోవడం అనుభవించడం మరొకరు ఎందరో
ఎన్నో రకాలుగా ఎన్నో విధాల ప్రపంచమంతా సాంకేతిక విజ్ఞానంతో సాగుతున్నది
అన్ని రంగాలలో ఎన్నో అనుభవ విజ్ఞాన అద్భుతాలు సాగిపోతూనే ఉన్నాయి
No comments:
Post a Comment