Tuesday, January 25, 2011

నీవేమి మాట్లాడుతున్నావో

నీవేమి మాట్లాడుతున్నావో నీ మేధస్సుకైనా అర్థమవుతున్నదా
నీ ఆవేదనల ప్రవర్తన రీతి చాతుర్యములను విజ్ఞానంగా మార్చుకో
సమాజానికి నీ వివేక గుణ తత్వాల మహా విజ్ఞానాన్ని అందించు
మరో మనిషికి సమాజ విచక్షణతో పదార్థ మాట తీరును కలిగించు
పదార్థము తెలిస్తే పదాల వాడుక ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలియును
పదార్థము తెలియక వివిధ భాషల ప్రాముఖ్యతలు తెలియకుండాపోతున్నాయి
మన భాషలో అన్నింటికీ పదాలు ఉన్నాయనే దాని కన్నా
అన్నీ పదాలను గుణార్థాన్ని ఇచ్చే విధంగా వాడుకోవాలనే విచక్షణ ఉండాలి
అందరికి అర్థమయ్యేలా భాషా ప్రావీణ్యాన్ని అభివృద్ధి చేసుకో
తెలుగు భాషలో తెలుగు తల్లి ఉందనే భావనతో పదాలను పలుకు పలికించు

No comments:

Post a Comment